: క్రికెటర్ అమిత్ మిశ్రాకు ఊరట... కేసు విత్ డ్రా!


టీమిండియా స్పిన్నర్ అమిత్ మిశ్రాకు ఊరట లభించింది. బెంగళూరులోని హోటల్ లో తనపై దాడి చేశాడని ఆరోపిస్తూ ఓ మహిళ మిశ్రాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో మిశ్రాపై ఎఫ్ఐఆర్ నమోదయింది. అంతేకాకుండా మిశ్రాపై విచారణకు బీసీసీఐ ఆదేశించింది. ఈ నేపథ్యంలో, అమిత్ మిశ్రా చిక్కుల్లో పడ్డాడనే అందరూ భావించారు. అయితే, మిశ్రాపై పెట్టిన కేసును ఉపసంహరించుకుంటున్నానని సదరు మహిళ తెలిపింది. తాను, మిశ్రా ఇద్దరం మంచి స్నేహితులమని, ఇకపై కూడా మంచి మిత్రులుగా కొనసాగుతామని చెప్పింది. దీంతో, మిశ్రాకు ఊరట లభించినట్టయింది.

  • Loading...

More Telugu News