: రాంలీలా మైదాన్ లో ఘనంగా రావణ దహనం
ఢిల్లీలోని రాంలీలా మైదాన్ లో రావణ దహనం ఘట్టాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఢిల్లీ నలుమూలల నుంచి భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. చెడు, అహంకారంపై సాధించిన విజయానికి ప్రతీకగా దసరా మహోత్సవాన్ని ఢిల్లీ వాసులు రాంలీలా మైదాన్ లో ప్రతి ఏటా ఘనంగా నిర్వహించుకుంటారు. ఈ సందర్భంగా రావణ దహనాన్ని తిలకించేందుకు వచ్చే సందర్శకుల కోసం పోలీసులు భారీ ఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో ఎర్రకోట వద్ద భారీ సందడి నెలకొంది.