: చంద్రబాబులాగే మోదీ కూడా మట్టి చల్లి పోయారు: శ్రీకాంత్ రెడ్డి
అమరావతి శంకుస్థాపన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏదైనా ప్రకటన చేస్తారని ఆశించిన రాష్ట్ర ప్రజలకు తీవ్ర నిరాశ మిగిలిందని వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబులాగానే మోదీ కూడా రెండు కేజీల మట్టి చల్లారని ఎద్దేవా చేశారు. ఇద్దరూ కలసి ఏపీ ప్రజలను మోసం చేశారని అన్నారు. ప్రత్యేక హోదా రాకపోతే రాయలసీమ, ఉత్తరాంధ్రలు అన్యాయమైపోతాయని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందరి సలహాలు స్వీకరించాలని అన్నారు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి నిర్మాణం చేపట్టారని ఆరోపించారు.