: మార్చి నాటికి సూర్యాపేట జిల్లా...పేదలకు స్వర్ణయుగం: కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో పేదలకు స్వర్ణయుగం రాబోతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. నల్గొండ జిల్లా సూర్యాపేటలో ఆయన డబుల్ బెడ్ రూం ఇళ్లకు శంకుస్థాపన చేశారు. గొల్లబజార్ లో సూర్యాపేట నియోజకవర్గం కింద 400 డబుల్ బెడ్ రూం ఇళ్లు, ముఖ్యమంత్రి కోటా కింద 500 ఇళ్లను నిర్మించనున్నామని ఆయన తెలిపారు. పేదల ఆత్మగౌరవం కాపాడేందుకు డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. ఇకపై తెలంగాణలో పేదల బతుకులు మారనున్నాయని ఆయన చెప్పారు. అలాగే, వచ్చే మార్చి నాటికి సూర్యాపేటను జిల్లాను చేస్తానని ఆయన తెలిపారు. ఈలోగా జిల్లా కేంద్రానికి ఉండాల్సిన అన్ని హంగులను సూర్యపేటలో కల్పిస్తామని ఆయన చెప్పారు. మిడ్ మానేరు ద్వారా సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాలకు నీరందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 40 వేల కోట్లతో పేదల ప్రతి ఇంటికి మంచి నీరు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని ఆయన తెలిపారు.