: టాప్ ర్యాంక్ కోల్పోయిన సైనా నెహ్వాల్
భారత టెన్నిస్ స్టార్ సైనా నెహ్వాల్ వరల్డ్ టాప్ ర్యాంకును కోల్పోయింది. ఈ రోజు ప్రకటించిన తాజా జాబితాలో సైనా ఓ ర్యాంకు కోల్పోయి రెండో స్థానానికి పడిపోయింది. గత రెండు టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన లేకపోవడంతో ర్యాంక్ కోల్పోక తప్పలేదు. ప్రపంచ ఛాంపియన్ కరోలినా మారిన్ టాప్ ర్యాంకుకు చేరుకుంది. మరోవైపు పీవీ సింధు 13వ ర్యాంక్ ను నిలబెట్టుకుంది. పురుషుల సింగిల్స్ లో పారుపల్లి, శ్రీకాంత్, ప్రణోయ్ ల ర్యాంకులు దిగజారాయి. శ్రీకాంత్ 6, కశ్యప్ 10, ప్రణోయ్ 17వ ర్యాంకులకు పడిపోయారు.