: నేను హామీ ఇస్తున్నా... మోదీ,బాబు జోడీ మాటనిలబెట్టుకుంటుంది: ప్రధాని
నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు జోడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటుందని హామీ ఇస్తున్నానని ప్రధాని స్పష్టం చేశారు. అమరావతి శంకుస్థాపన అనంతరం ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల వెంట ఉందని చెప్పడానికే తాను ఇక్కడికి వచ్చానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమానికి తాము కట్టబడి ఉన్నామని ఆయన చెప్పారు. సరైన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం సరైన నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రజలు విశ్వాసంతో ఉండాలని ఆయన సూచించారు. అమరావతి ప్రశస్తమైన నగరంగా విలసిల్లుతుందని ఆయన ఆకాంక్షించారు.