: మోదీ మాటల గారడీతో మళ్లీ మోసం చేశారు: జేడీ శీలం
ప్రధాని నరేంద్ర మోదీ మాటల గారడీతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరోసారి మోసం చేశారని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం విమర్శించారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, అమరావతి శంకుస్థాపనలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ప్రత్యేకహోదాపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకహోదాపై ఎందుకు ప్రకటన చేయించలేదని ఆయన నిలదీశారు. ఏరు దాటాక తెప్ప తగలేసిన చందాన, మోదీ మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశారని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ హామీ ఇవ్వని మోదీ నిధులు కేటాయిస్తారని ఎలా నమ్మగలమని ఆయన ప్రశ్నించారు.