: అమరావతి గొప్ప నగరంగా అవతరిస్తుంది: మోదీ


ఆంధ్రులు కోరుకుంటున్న విధంగా అమరావతి అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. గొప్ప రాజధాని నిర్మాణానికి పూనుకున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ సందర్భంగా మోదీ శుభాకాంక్షలు తెలిపారు. శతాబ్దాల చరిత్ర, ఆధునిక హంగుల కలయికతో అమరావతి అద్భుతంగా ఉంటుందని చెప్పారు. గొప్ప ఫైనాన్షియల్ హబ్ గా అమరావతి రూపుదిద్దుకుంటుందని తెలిపారు. విజయదశమి రోజున ఆంధ్రప్రదేశ్ మహోన్నత ఘట్టంవైపు అడుగువేసిందని చెప్పారు. అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ ముఖ్యమంత్రిని ఆహ్వానించడానికి చంద్రబాబు స్వయంగా ఆయన నివాసానికి వెళ్లారన్న విషయం తెలిసిన తర్వాత చాలా సంతోషం కలిగిందని మోదీ చెప్పారు. ఇద్దరు ముఖ్యమంత్రుల కలసి పనిచేయాలని సూచించారు.

  • Loading...

More Telugu News