: అమరావతి ప్రపంచంలోనే అద్భుత నగరంగా ఎదగాలి... తెలంగాణ సీఎం కేసీఆర్


నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రపంచంలోనే అద్భుత నగరంగా ఎదగాలని తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అభిలషించారు. శంకుస్థాపనకు వచ్చిన సందర్భంగా కేసీఆర్ ప్రసంగిస్తూ అమరావతి నగరాభివృద్ధికి తమ వంతు సహకారం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. విజయదశమి రోజున మొదలుపెట్టిన అమరావతికి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. అమరావతికి, ఏపీ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజల తరఫున తాను శుభాకాంక్షలు చెబుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ ప్రసంగించేందుకు లేచిన సమయంలో జనం పెద్ద పెట్టున స్వాగత నినాదాలు చేశారు. అంతేకాక, అమరావతికి సహకారం అందిస్తామని చెప్పినప్పుడు కూడా జనం కేరింతలు కొట్టారు.

  • Loading...

More Telugu News