: పార్లమెంటు మట్టి, యమునా నది జలాన్ని తీసుకొచ్చిన మోదీ... చంద్రబాబుకు అందజేత


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు ప్రాంగణంలోని మట్టిని, యమునా నది జలాన్ని తన వెంట తీసుకొచ్చారు. యాగశాలలో యంత్రన్యాసం చేసిన తర్వాత వేదికపైకి వచ్చిన మోదీ వాటిని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి అందజేశారు. ఈ సందర్భంగా మన మట్టి,- మన రాజధాని అన్న పదాలతో పాటు ప్రజా రాజధానిని తెలుగులో ఉచ్చరించారు. ప్రధాని మోదీ నోట తెలుగు పదాలు వినిపించడంతో జనం జేజేలు పలికారు.

  • Loading...

More Telugu News