: శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించిన మోదీ


అమరావతి శంకుస్థాపనలో అసలైన క్రతువు మొదలైంది. ఫొటో గ్యాలరీని సందర్శించిన అనంతరం రాజధాని శంకుస్థాపన కార్యక్రమం మొదలైంది. యాగశాలకు చేరుకున్న ప్రధాని మోదీ హోమగుండాన్ని వెలిగించారు. పురోహితుల వేద మంత్రోచ్చారణ మధ్య ఈ కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమం సందర్భంగా మోదీతో పాటు గవర్నర్ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్ లు ఉన్నారు. ఈ సందర్భంగా మోదీ, చంద్రబాబు, వెంకయ్య, కేసీఆర్ లను పురోహితులు ఆశీర్వదించారు.

  • Loading...

More Telugu News