: అమరావతికి చేరుకున్న మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకున్నారు. కాసేపటి క్రితం గన్నవరం విమానాశ్రయానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో చేరుకున్న ఆయనకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రులు వెంకయ్య, అశోక్ గజపతిరాజులు స్వాగతం పలికారు. అనంతరం అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మోదీ అమరావతికి చేరుకున్నారు. మోదీతో పాటు నరసింహన్, చంద్రబాబు, వెంకయ్యలు కూడా హెలికాప్టర్ లో వచ్చారు. మోదీ రాకతో సభా ప్రాంగణంలో సందడి నెలకొంది.