: గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. నేటి ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన మోదీ, కొద్దిసేపటి క్రితం గన్నవరంలో ల్యాండయ్యారు. ప్రధాని మోదీకి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, కేంద్రం మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజులు ఘనంగా స్వాగతం పలికారు. మరికాసేపట్లో ప్రధాని మోదీ తనకు స్వాగతం పలికిన ప్రముఖులతో కలిసి నాలుగు హెలికాప్టర్లలో ఉద్ధండరాయునిపాలెం బయలుదేరతారు.