: అమరావతి శంకుస్థాపనలో భాగస్వామి కావడం ఆనందంగా ఉంది: కిషన్ రెడ్డి
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అమరావతి శంకుస్థాపనకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, అమరావతికి రావడం, శంకుస్థాపన కార్యక్రమంలో భాగస్వామి కావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఇతర రాజధానులతో పోటీ పడే విధంగా అమరావతి అభివృద్ధి చెందుతుందని చెప్పారు. బీజేపీ తెలంగాణ శాసనసభా పక్ష నేత లక్ష్మణ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అమరావతి అభివృద్ధిపథంలో దూసుకుపోతుందని అన్నారు.