: అమరావతిలో అడుగిడిన కేసీఆర్
ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ లో సూర్యాపేట నుంచి బయల్దేరిన ఆయన అమరావతి ప్రాంగణంలో ల్యాండ్ అయ్యారు. పలువురు ఏపీ మంత్రులు కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. ఆయనతో పాటు తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్, మంత్రి జగదీష్ రెడ్డి, ఈటెల రాజేందర్ లు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. కేసీఆర్ రాకతో అమరావతి ప్రాంగణంలో సందడి నెలకొంది.