: సూర్యాపేట నుంచి హెలికాప్టర్ లో అమరావతికి బయలుదేరిన కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొద్దిసేపటి క్రితం నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు బయలుదేరారు. నిన్న రాత్రి నల్లగొండ జిల్లా సూర్యాపేట చేరుకున్న కేసీఆర్ మంత్రి జగదీశ్ రెడ్డి ఇంటిలో బస చేశారు. కొద్దిసేపటి క్రితం టీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్ రెడ్డిలతో కలిసి హెలికాప్టర్ లో ఆయన అమరావతికి బయలుదేరారు. గన్నవరం ఎయిర్ పోర్టులో దిగనున్న కేసీఆర్ తొలుత కనకదుర్గమ్మను దర్శించుకుని ఆ తర్వాత అమరావతి శంకుస్థాపన స్థలి ఉద్ధండరాయునిపాలెం చేరుకుంటారు.