: మారిన కేసీఆర్ షెడ్యూల్...తొలుత దుర్గమ్మ దర్శనం, ఆ తర్వాత అమరావతికి పయనం
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు హాజరు కానున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు షెడ్యూల్ లో కాస్తంత స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నల్లగొండ జిల్లా సూర్యాపేట నుంచి మరికాసేపట్లో హెలికాప్టర్ లో బయలుదేరనున్న కేసీఆర్ విజయవాడ సమీపంలోని గన్నవరం చేరుకుని అక్కడి నుంచి ఉద్ధండరాయునిపాలెం చేరుకోవాల్సి ఉంది. అయితే నేటి ఉదయం తన షెడ్యూల్ ను కేసీఆర్ కొంతమేర మార్చుకున్నారు. గన్నవరంలో దిగిన తర్వాత తొలుత ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను ఆయన దర్శించుకుంటారు. అనంతరం ఆయన అక్కడి నుంచి ఉద్ధండరాయునిపాలెం బయలుదేరతారు.