: అమరావతి వేదికపై ‘మచ్చ లేని చంద్రుడు’ నృత్య రూపకం
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు తరలివెళ్లిన తెలుగు ప్రజలను అక్కడ ఓ అరుదైన ప్రదర్శన ఆకట్టుకోనుంది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై కళాకారులు ఓ నృత్య రూపకాన్ని ప్రదర్శించనున్నారు. ‘మచ్చ లేని చంద్రుడు’ పేరిట ప్రదర్శితం కానున్న ఈ రూపకంలో అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు చేస్తున్న కృషిని కళాకారులు ఎలుగెత్తి చాటనున్నారు. అంతేకాక ఏ ఒక్కరూ అడక్కుండానే తన ఆస్తులను స్వచ్ఛందంగా వెల్లడిస్తున్న చంద్రబాబు సచ్ఛీలతను కూడా ఈ రూపకంలో ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు సమాచారం. అమరావతి శంకుస్థాపన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నేటి ఉదయం 9.50 నుంచి 10.00 గంటల వరకు ఈ రూపకం ప్రజలకు కనువిందు చేయనుంది.