: ‘మన అమరావతి- మన రాజధాని’ పోటెత్తుతున్న ట్వీట్లు, రీ ట్వీట్లు!


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి భారీ మద్దతు కూడగట్టే ఉద్దేశంతో టీడీపీ మొదలెట్టిన ‘మన అమరావతి- మన రాజధాని’కి జనామోదం పోటెత్తుతోంది. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ కమిటీ కార్యదర్శి నారా లోకేశ్ లతో పాటు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ లు ‘మన అమరావతి- మన రాజధాని’ హ్యష్ ట్యాగ్ లు పట్టుకుని తీసుకున్న ఫొటోలు ట్విట్టర్ లోకి నిన్ననే చేరిపోయాయి. వీటిని చూసిన తెలుగు ప్రజలు స్వచ్ఛందంగా తాము కూడా సదరు హ్యాష్ ట్యాగ్ తో ఫొటోలు, సెల్ఫీలు తీసుకుని వాటిని ట్విట్టర్ లో అప్ లోడ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలకు ట్వీట్లు, రీ ట్వీట్లు పోటెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News