: అమరావతి శిలాఫలకం రెడీ... ఎవరెవరి పేర్లున్నాయంటే...!


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. తెలుగు ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయేలా నిర్వహిస్తున్న ఈ వేడుకలో ప్రతి అంశం కూడా ప్రత్యేకమే. ఇక కార్యక్రమాన్ని భావితరాలకు గుర్తు చేసేలా ఏర్పాటు కానున్న శిలాఫలకం మరింత ప్రత్యేకమనే చెప్పాలి. ఇప్పటికే ఈ శిలాఫలకానికి ఏపీ సర్కారు తుది మెరుగులు దిద్దింది. మొత్తం 16 మంది పేర్లతో ఈ ఫలకం రూపొందింది. వారెవరెవరంటే... ముఖ్య అతిథిగా హాజరవుతున్న ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు, పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య, నాగాలాండ్ గవర్నర్ పద్మనాభ బాలకృష్ణ ఆచార్య, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ భోసలే పేర్లు శిలాఫలకంపై ఉన్నాయి. వీరితో పాటు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, నిర్మలా సీతారామన్, సుజనా చౌదరి, బండారు దత్తాత్రేయ పేర్లు కూడా ఉన్నాయి. ఇక అమరావతికి మాస్టర్ ప్లాన్ అందించిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తో పాటు అమరావతి నిర్మాణంలో పాలుపంచుకొంటున్న జపాన్ మంత్రి ఇసుకే టకాచీ పేర్లకూ ఈ ఫలకంపై చోటు దక్కింది.

  • Loading...

More Telugu News