: భారతావనికి క్షమాణలు చెప్పాల్సిన మొట్టమొదట ఉగ్రవాది గాడ్సే: కాంగ్రెస్


జాతిపిత మహాత్మా గాంధీని పొట్టనబెట్టుకున్న నాథూరాం వినాయక్ గాడ్సే స్వతంత్ర భారతావనికి క్షమాపణలు చెప్పాల్సిన మొట్టమొదటి తీవ్రవాది అని కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. గాడ్సే వర్ధంతి వేడుకలను జరుపనీయబోమని కాంగ్రెస్ స్పష్టం చేసింది. గాడ్సేను ఉరితీయబడిన నవంబర్ 15వ తేదీని బలిదాన్ దివన్ గా జరుపనున్నట్లు హిందూ మహాసభ అధ్యక్షుడు చంద్రప్రకాశ్ కౌశిక్ ప్రకటించిన విషయం తెలిసిందే. గాడ్సే వర్ధంతి వేడుకల అంశం విషయమై కేంద్రం కలుగజేసుకోవాలని, ఆ కార్యక్రమం నిర్వహించకుండా చూడాలని మహారాష్ట్ర అసెంబ్లీ ప్రతిపక్షనేత రాధాకృష్ణ విఖే పాటిల్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News