: "బావా! ఆల్ ద బెస్ట్..."... వరుణ్ తేజ్ కు బన్నీ గ్రీటింగ్స్
'కంచె'సినిమా రేపు విడుదల కానుండడంతో వరుణ్ తేజ్ కు టాలీవుడ్ యువ నటుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమా విడుదల సందర్భంగా ఆ సినిమా యూనిట్ కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. "బావా... కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్" అని వరుణ్ తేజ్ కు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుందని, తనతో 'వేదం' సినిమాను రూపొందించిన క్రిష్ పై అభిమానం కురిపించాడు. అల్లు అర్జున్ తో పాటు రానా దగ్గుబాటి క్రిష్ కు శుభాకాంక్షలు తెలిపారు. 'కంచె' సినిమాను చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని రానా తెలిపాడు. 'థియేటర్లో కలుద్దాం.. బాయ్స్' అంటూ ట్వీట్ చేశాడు. పలువురు సినీ ప్రముఖులు వరుణ్ తేజ్, క్రిష్ కు అభినందనలు చెబుతున్నారు.