: ఆ రీమేక్స్ లో చేయాలని ఉంది!: వరుణ్ తేజ్
తనకు గాలి, నీరు, ఆహారం... అంతా సినిమాయేనని టాలీవుడ్ వర్ధమాన నటుడు వరుణ్ తేజ్ తెలిపాడు. 'ముకుంద' సినిమాతో ప్రేక్షకులను అలరించిన వరుణ్ తేజ్ రేపు 'కంచె' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. పాత్ర నచ్చితే ప్రతినాయకుడి పాత్రలో నటించేందుకు అభ్యంతరం లేదని తెలిపాడు. ఏదైనా సినిమా చేసేముందు తన తండ్రితో చర్చిస్తానని వరుణ్ తేజ్ తెలిపాడు. బాబాయ్ సినిమాల్లో 'తమ్ముడు', పెదనాన్న సినిమాల్లో 'ఛాలెంజ్', 'రుద్రవీణ' ఇష్టమని, అవకాశం వస్తే వాటి రీమేక్ లో నటించేందుకు మొగ్గుచూపుతానని వరుణ్ తేజ్ తెలిపాడు. 'కంచె' సినిమా కోసం చాలా కష్టపడ్డామని, యుద్ధం సన్నివేశాలు బాగా వచ్చేందుకు తీవ్రంగా శ్రమించామని ఆయన చెప్పాడు. సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందని వరుణ్ తేజ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. సినిమాలు లేని జీవితాన్ని ఊహించలేదని వరుణ్ తేజ్ తెలిపాడు.