: వీహెచ్పీ నేత అశోక్ సింఘాల్ కు అస్వస్థత
విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ) నేత అశోక్ సింఘాల్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే గుర్గావ్ లోని ఒక ఆసుపత్రికి ఆయనను తరలించి వైద్యసేవలందించారు. నవరాత్రి పూజ సందర్భంగా ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ పట్టణానికి అశోక్ సింఘాల్ వెళ్లారు. పూజ జరుగుతున్న సమయంలో తనకు ఊపిరాడటం లేదని, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని సింఘాల్ చెప్పడంతో వెంటనే ఎయిర్ అంబులెన్స్ ద్వారా గుర్గావ్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ, శ్వాస సంబంధమైన ఇబ్బంది తలెత్తడం వల్లే సింఘాల్ కు ఊపిరాడలేదని, ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని చెప్పారు. అయితే, తప్పనిసరిగా ఆయన వైద్యుల పరిశీలనలో ఉండాలని చెప్పారు.