: 'నాన్నకు ప్రేమతో' టీజర్ రిలీజ్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్
జూనియర్ ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా సుకుమార్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'నాన్నకు ప్రేమతో' సినిమా టీజర్ ను నటి రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసింది. టీజర్ లింక్ ను ట్విట్టర్ ద్వారా షేర్ చేసి చూడమని చెప్పింది. టీజర్ లో జూనియర్ ఎన్టీర్ విభిన్నమైన హెయిర్ స్టైల్ తో సందడి చేశాడు. టీజర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. కాగా దసరా కానుకగా టీజర్ ను విడుదల చేసినట్టు రకుల్ పేర్కొంది. కాగా, ఈ సినిమాకు సంగీతం దేవీశ్రీ ప్రసాద్ అందిస్తుండగా, ఇతర ముఖ్య పాత్రల్లో జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటిస్తున్నారు.