: సీఎం కేసీఆర్ ను కలిసిన సినీనటుడు కృష్ణ దంపతులు
తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ను ప్రముఖ సినీనటుడు సూపర్ స్టార్ కృష్ణ దంపతులు కలిశారు. బుధవారం సీఎం క్యాంపు కార్యాలయానికి వారు వెళ్లారు. విజయనిర్మల సోదరుడు రఘునాథ్ కుమార్తె వివాహం ఈ నెల 25 వ తేదీన జరగనుంది. ఈ సందర్భంగా కేసీఆర్ కు వివాహా ఆహ్వానపత్రికను వారు అందజేశారు. విజయనిర్మల తనయుడు, నటుడు నరేష్ కూడా వీరి వెంట ఉన్నారు.