: భక్తుల రద్దీ తగ్గడంతో నేరుగా శ్రీవారి దర్శనం... సంతోషపడుతున్న భక్తులు
తిరుమలలో భక్తుల రద్దీ ఈరోజు అంతగా లేదు. దీంతో అక్కడ ఉన్న భక్తులకు నేరుగా శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారు టీటీడీ అధికారులు. సాయంత్రం ఆరు గంటల వరకు సుమారు 47,090 మంది భక్తులు నేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. దీంతో భక్తుల ఆనందానికి అంతులేకుండా పోయింది. గంటల తరబడి క్యూలో నిలబడితేనే కానీ దొరకని ఏడుకొండలవాడి దర్శన భాగ్యం తమకు తక్కువ సమయంలో లభించడం, అదీకాక నేరుగా శ్రీవారి దర్శనానికి అక్కడి అధికారులు పంపడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.