: వ్యూహ, ప్రతివ్యూహాల్లో సఫారీ, టీమిండియా జట్లు... రేపే నాలుగో వండే!


టీమిండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య నాలుగో వండే మ్యాచ్ రేపు చెన్నైలో చిదంబరం స్టేడియం వేదికగా జరగనుంది. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో ఇప్పటికి 2-1తేడాతో ముందంజలో ఉన్న సఫారీలు సిరీస్ ను రేపే గెలుచుకోవాలని భావిస్తుండగా, ఈ మ్యాచ్ లో విజయం సాధించి వన్డే సిరీస్ ను మరి రసవత్తరంగా ముగించాలని టీమిండియా భావిస్తోంది. దీంతో రెండు జట్ల కెప్టెన్లు వ్యూహ, ప్రతివ్యూహాల్లో మునిగిపోయారు. డికాక్ ఫాంలోకి రావడంతో సౌతాఫ్రికా ఆనందంలో ఉండగా, మోర్నీ మోర్కెల్, డుమిని వన్డేకు దూరమవడం సౌతాఫ్రికాను కాస్త ఇబ్బంది పెడుతోంది. ఈ మ్యాచ్ లో ఓటమిపాలైతే వన్డే సిరీస్ తో పాటు, వన్డేల్లో వరల్డ్ నెంబర్ 2 స్థానం కూడా సౌతాఫ్రికాకు అప్పగించాల్సిందే. దీంతో ధోనీ సఫారీలను ఎలాగైనా నిలువరించాలని కృతనిశ్చయంతో ఉన్నాడు. మూడో వన్డే బ్యాటింగ్ ఆర్డర్ లో చేసిన మార్పులు పెద్దగా సత్ఫలితాలివ్వకపోవడంతో ఈసారి ధోనీ ఎలాంటి ప్రణాళికలు రచిస్తాడోనని అంతా ఆసక్తి గా చూస్తున్నారు. బౌలింగ్ లో ఉమేష్ యాదవ్ అంచనాల మేరకు ఆకట్టుకోలేకపోవడంతో అతని స్థానంలో రమేష్ అరవింద్ కు అవకాశం లభించే అవకాశం ఉంది. రేపటి మ్యాచ్ లో దూకుడుగా ఆడి సిరీస్ చేజిక్కించుకోవాలని సౌతాఫ్రికా భావిస్తుండగా, పట్టుదలతో ఆడి సౌతాఫ్రికాను నిలువరించి, పైచేయి సాధించాలని టీమిండియా భావిస్తోంది.

  • Loading...

More Telugu News