: ప్రధాని పర్యటన నేపథ్యంలో తిరుమలలో విస్తృత తనిఖీలు
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో తిరుమలలో విస్తృత తనిఖీలు చేపట్టారు. వసతి గృహాలు, శ్రీవారి ఆలయ పరిసరాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తిరుమల కనుమ రహదారులు, పరిసరాల్లో ప్రత్యేక బలగాలను మోహరించారు. కాగా, నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనా కార్యక్రమానికి ప్రధాని మోదీ రేపు మధ్యాహ్నం రానున్నారు. అమరావతి శంకుస్థాపన పూజ కార్యక్రమం తర్వాత మోదీ ప్రసంగం ఉంటుంది. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుపతి ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం రేపు సాయంత్రం తిరుమలకు ప్రధాని చేరుకుంటారు.