: పెళ్లై పిల్లలున్నా బాలీవుడ్ ఆదరిస్తుంది: లారాదత్తా
పెళ్లై పిల్లలున్నా బాలీవుడ్ ఆదరిస్తుందని ప్రముఖ నటి లారాదత్తా తెలిపింది. 'ఫితూర్' సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆమె మాట్లాడుతూ, వివాహిత హీరోయిన్ల కోసం దర్శకులు కథలు సిద్ధం చేస్తున్నారని తెలిపింది. ప్రస్తుతం ఫితూర్ సినిమాలో నటిస్తున్నానని చెప్పింది. ఈ సినిమాలో తనది ప్రత్యేక పాత్ర అని, ఆదిత్యరాయ్ కపూర్, కత్రినా కైఫ్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారని తెలిపింది. అలాగే టీమిండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న 'అజహర్' సినిమాలో లాయర్ పాత్ర పోషిస్తున్నానని లారాదత్తా తెలిపింది. కాగా, లారాదత్తా ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు మహేష్ భూపతిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది.