: సీఎం చంద్రబాబుకు జాతీయనేతల అభినందనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని జాతీయ నేతలు అభినందనలతో ముంచెత్తుతున్నారు. శాతవాహనులు, ఇక్ష్వాకులు, చోళులు పరిపాలించిన నేలపై ఏపీ నూతన రాజధాని నిర్మాణం భారత సంస్కృతికి పట్టం కట్టడమేనంటూ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రశంసించారు. ప్రజా రాజధానిని నిర్మించే కార్యదక్షత చంద్రబాబుకే ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ప్రపంచంలోనే అందమైన నగరంగా అమరావతి నిలుస్తుందంటూ విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి, మాజీ ప్రధాన సైనికాధికారి వీకే సింగ్ అభినందనలతో ముంచెత్తారు.