: అమరావతి శిలాఫలకంపై కేసీఆర్ పేరు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు అమరావతి శిలాఫలకంపై రాశారు. దాంతో దీనిపై పలువురు టీడీపీ నేతలు సైతం విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు కారణమైన కేసీఆర్ పేరు ఎలా రాస్తారంటూ విమర్శిస్తున్నారు. అయితే, ప్రొటోకాల్ ప్రకారం కేసీఆర్ పేరు ఉండాల్సిందేనని అధికారులు తెలిపారు. ప్రొటోకాల్ ప్రకారం శిలాఫలకంపై గవర్నర్లు, ముఖ్యమంత్రుల పేర్లు ఉండటం సహజం.