: ఇద్దరు చంద్రులు ప్రజలకు చీకట్లు పంచుతున్నారు!: మధుయాష్కీ
అధికారమనే వెన్నెలను ఆస్వాదిస్తున్న ఇద్దరు చంద్రులూ ప్రజలకు చీకట్లను పంచుతున్నారని కాంగ్రెస్ పార్టీ నేత మధు యాష్కీ విమర్శించారు. ఎన్టీఆర్ కు నారా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారని ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్ సినిమాల్లో నటిస్తే, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు లు రాజకీయాల్లో నటిస్తున్నారంటూ మండిపడ్డారు. ఎర్రవెల్లి గ్రామానికి ఉత్తమ సర్పంచ్ గా, తెలంగాణ రాష్ట్రానికి విఫల సీఎంగా కేసీఆర్ కు అవార్డులివ్వాలన్నారు. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ నుంచి తప్పించుకునేందుకే వాళ్లిద్దరి ఏకాంత భేటీలంటూ విమర్శించారు.