: అమరావతి ఆహ్వానాన్ని నేను తిరస్కరించలేదు: నాదెండ్ల భాస్కరరావు
ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన ఆహ్వానపత్రాన్ని తాను తిరస్కరించలేదని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు చెప్పారు. ఆహ్వానపత్రం ఇవ్వడానికి మంత్రి అయ్యన్నపాత్రుడు వస్తారన్న సమాచారంతో... ఇంటివద్ద తాను చాలాసేపు ఎదురు చూశానని చెప్పారు. అయితే, ఎమ్మెల్సీ జనార్దన్ వచ్చి వెళ్లినట్టు తనకు తెలియదని అన్నారు. ఈ ఉదయం ఆహ్వానపత్రాన్ని ఇవ్వడానికి నాదెండ్ల ఇంటికి జనార్దన్ వెళ్లగా, గన్ మెన్ కు ఇవ్వాలని చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే నాదెండ్ల వివరణ ఇచ్చారు.