: ఆ డబ్బు మాకు వద్దు...ప్రతి నెలా పేదలకు అందజేయండి: అమితాబ్


ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ స్కీం నుంచి తన కుటుంబానికి అందజేయనున్న మొత్తాన్ని పేదలకు అందజేయాలని బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ సూచించి పెద్ద మనసు చాటుకున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాజాగా పెన్షన్ స్కీం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ప్రతిష్ఠాత్మకమైన యశ్ భారతి సమ్మాన్ పురస్కారం పొందిన యూపీ వాసులకు ప్రతి నెలా 50 వేల రూపాయల పెన్షన్ అందజేయనుంది. దీంతో అమితాబ్ కుటుంబానికి చెందిన ముగ్గురు ఆ పెన్షన్ కు అర్హులయ్యారు. అయితే ఈ మొత్తాన్ని తమ కుటుంబానికి ఇచ్చే కంటే నిరుపేదలకు అందజేసే స్కీంతో జత చేసి పేదలను ఆదుకోవాలని అమితాబ్ యూపీ ప్రభుత్వానికి సూచించారు.

  • Loading...

More Telugu News