: పవన్ కల్యాణ్ ఇంటి వద్ద యువకుల రచ్చ... వాచ్ మన్ పై దౌర్జన్యం!


హైదరాబాదులోని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇంటి వద్ద యువకులు హంగామా సృష్టించారు. మద్యం మత్తులో నానా రచ్చ చేశారు. పవన్ ఇంటి వాచ్ మన్ ను చితకబాదుతున్న ఆ యువకులను బౌన్సర్లు అడ్డుకున్నారు. బౌన్సర్లు ఎదురుతిరగడంతో యువకులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ మేరకు బంజారా హిల్స్ పోలీసులకు బౌన్సర్లు ఫిర్యాదు చేశారు. పవన్ కల్యాణ్ నివాసం ముందు నానా హంగామా చేసిన ఆ యువకులెవరనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆకతాయి చేష్టలా? లేక కావాలనే ఇటువంటి చర్యలకు పూనుకున్నారా? అనేది పోలీసుల దర్యాప్తులో తెలియనుంది. కాగా, పవన్ కల్యాణ్ ప్రస్తుతం గుజరాత్ లో జరుగుతున్న షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

  • Loading...

More Telugu News