: చంద్రబాబు, వెంకయ్యల దిష్టిబొమ్మలు దహనం
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటూ నేతలు, కార్యకర్తలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. చెవిరెడ్డి మాట్లాడుతూ, గెలిస్తే ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సమయంలో తిరుపతి సభలో చెప్పారని గుర్తు చేశారు. వెంకయ్యనాయుడైతే అసలు మాట్లాడటమే మానేశారని మండిపడ్డారు. ఈ క్రమంలో చంద్రబాబు, వెంకయ్యల దిష్టి బొమ్మలను దహనం చేశారు.