: మోదీ అపాయింట్ మెంట్ కోసం మరోసారి యత్నించిన వైకాపా


ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీ రేపు అమరావతిలో ప్రకటన చేయాలని వైకాపా నేత వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ప్రధాని అపాయింట్ మెంట్ కోసం గతంలోనే లేఖ రాశామని గుర్తుచేశారు. ఈ రోజు కూడా అపాయింట్ మెంట్ కోసం ప్రధాని కార్యాలయాన్ని సంప్రదించామని తెలిపారు. గన్నవరం లేదా తిరుపతిలో వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రధానిని కలసి ప్రత్యేక హోదాపై వినతిపత్రం అందజేస్తామని చెప్పారు. ఒక వేళ అపాయింట్ మెంట్ ఇవ్వకపోయినా, ప్రత్యేక హోదాపై ప్రధాని ప్రకటన చేయాలని అన్నారు.

  • Loading...

More Telugu News