: బెంగళూరులో తయారైన స్టాంపు సైజున్న 'చిప్'తో డిజిటల్ ఇండియా పరుగులు!
అది చిన్న స్టాంప్ సైజున్న చిప్. బెంగళూరులో తయారైంది. పేరు పృథ్వి. ఇండియాలోని గ్రామీణులను ఇంటర్నెట్ కు అనుసంధానం చేసే దిశగా ప్రారంభమైన 'డిజిటల్ ఇండియా'లో భాగంగా తమ లక్ష్యాలను అందుకునేందుకు గూగుల్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఇప్పుడు పృథ్వి వెంట పరుగులు పెట్టక తప్పని స్థితి. ఈ చిప్ ఓ పవర్ సిస్టమ్ గా పనిచేస్తూ, టెలివిజన్ సిగ్నల్స్ లో ఉన్న ఖాళీని లేదా వాడకుండా ఉన్న సెల్ ఫోన్ తరంగాలను వాడుకుంటూ ఇంటర్నెట్ ను బట్వాడా చేస్తుంది. దీన్ని సాంక్యా ల్యాబ్స్ తయారు చేసింది. ఈ చిప్ వాడకం పెరిగితే డిజిటల్ ఇండియా సాకారం మరింత వేగవంతమవుతుందని అంచనా. కాగా, ఈ చిప్ వాడకాన్ని మరింతగా పెంచి రూరల్ ఇండియాకు అందించేందుకు కేంద్రం నుంచి కొన్ని కీలక అనుమతులు రావాల్సి వుందని సాంక్యా ల్యాబ్స్ సీఈఓ పరాగ్ నాయక్ వివరించారు. అందుకు ఎంత సమయం పడుతుందన్న విషయంపై ఆధారపడి డిజిటల్ ఇండియా విస్తరణ ఉందని తెలిపారు. టెలివిజన్ సిగ్నల్స్ నుంచి వైఫై తరంగాలను ఇది అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.