: దూసుకెళ్లిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు లాభాలు


ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో 20 శాతం నికర లాభాల వృద్ధిని నమోదు చేసింది. జూలై - సప్టెంబర్ మధ్యకాలంలో బ్యాంకు నెట్ ప్రాఫిట్ గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే రూ. 2,381 కోట్ల నుంచి రూ. 2,869 కోట్లకు చేరుకుంది. ఈ విషయాన్ని బ్యాంకు నేడు బీఎస్ఈ ఫైలింగ్ లో వెల్లడించింది. స్థూలంగా ఎన్పీఏ (నాన్ ఫెర్ ఫార్మింగ్ అసెట్స్ - నిరర్థక ఆస్తులు) జూన్ తో ముగిసిన తొలి త్రైమాసికంతో పోలిస్తే 0.95 శాతం నుంచి 0.91 శాతానికి తగ్గిందని పేర్కొంది. నికరంగా 0.25 శాతం ఎన్పీఏ కొనసాగుతోందని వెల్లడించింది. నికర వడ్డీల మార్జిన్ 4.2 శాతమని, సీఏజీఆర్ (కాపిటల్ అడిక్వసీ రేషియో) 15.7 శాతం నుంచి 15.5 శాతానికి తగ్గిందని పేర్కొంది. ఈ ఫలితాల వెల్లడి అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సంస్థ ఈక్విటీ విలువ క్రితం ముగింపుతో పోలిస్తే 0.17 శాత, తగ్గి రూ. 1,093 వద్ద ట్రేడవుతోంది.

  • Loading...

More Telugu News