: అమిత్ మిశ్రాపై విచారణకు బీసీసీఐ ఆదేశం


టీమిండియా లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా చిక్కుల్లో పడ్డట్టే కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే, సౌత్ ఆఫ్రికాతో జరిగే నాలుగో వన్డేలో ఆడతాడా? లేదా? అనే విషయం కూడా డౌట్ గా కనిపిస్తోంది. గత నెలలో బెంగళూరులోని హోటల్ లో ఓ మహిళను దుర్భాషలాడటమే కాకుండా, ఆమెపై దాడి కూడా చేశాడన్న ఆరోపణలతో మిశ్రాపై బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కాపీని బీసీసీఐకి బెంగళూరు సెంట్రల్ డివిజన్ డీసీపీ సందీప్ పంపించారు. ఈ క్రమంలో, మిశ్రాపై విచారణకు బీసీసీఐ ఆదేశించింది. మిశ్రాపై ఐపీసీ 354, 328 సెక్షన్ల కింద కేసు నమోదైంది.

  • Loading...

More Telugu News