: డాలర్ శేషాద్రికి అస్వస్థత... అపోలోకు తరలింపు
తిరుమలకు ఏ వీఐపీ వచ్చినా ముందుండి వారికి దర్శనం చేయించే డాలర్ శేషాద్రి ఈ ఉదయం అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను తిరుపతిలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ ఉదయం నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వర్ణరథం ఊరేగింపు అనంతరం ఆయన ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పినట్టు తెలుస్తోంది. గతంలోనూ ఆయన గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా నిత్యమూ శ్రీవారి సేవలో భాగంగా, డాలర్ శేషాద్రి వాహనాల ముందు నిలిచి కనిపించారు. ఆయన పరిస్థితిపై మరింత సమాచారం తెలియాల్సి వుంది.