: చంద్రబాబు బంధువులు, స్నేహితుల కోసమే అమరావతి: బైరెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి మరోసారు విమర్శలు గుప్పించారు. తన బంధువులు, స్నేహితులు బాగుపడటం కోసమే అమరావతి నిర్మాణాన్ని చంద్రబాబు చేపట్టారని ఆరోపించారు. టీడీపీ పాలనలో రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతోందని బైరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సీమకు అన్యాయం జరిగితే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రాయలసీమ మీద ప్రేమ ఉన్న వారెవరూ అమరావతి శంకుస్థాపనకు వెళ్లరని చెప్పారు.