: పాత కేసులో కేసీఆర్ ను ప్రశ్నించిన సీబీఐ అధికారులు


ఓ పాత కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావును ప్రత్యేక సీబీఐ అధికారుల బృందం ప్రశ్నించింది. ఆయన నివాసానికి వెళ్లిన సీబీఐ అధికారులు గంటకు పైగా కేసీఆర్ ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం, 2006లో కేసీఆర్ కేంద్ర కార్మిక, ఉపాధి శాఖల మంత్రిగా ఉన్న సమయంలో, పలు రాష్ట్రాల్లో ఈఎస్ఐ భవనాలను నిర్మించే కాంట్రాక్టులను నేషనల్ బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్బీసీసీ)కి తొలుత ఇవ్వగా, దాన్ని రద్దు చేసి, ఏపీ ఫిషరీస్ విభాగంలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుకు ఇప్పించారన్నది కేసీఆర్ పై వచ్చిన ప్రధాన ఆరోపణ. సదరు కాంట్రాక్టర్ నాసిరకం నిర్మాణాలు చేపట్టడంతో 2007-08లో ఈఎస్ఐ కార్పొరేషన్ విచారణకు ఆదేశించింది. 2011లో కేసు నమోదు చేసిన సీబీఐ అవినీతి వ్యతిరేక విభాగం, ఈ కేసులో కనీసం రూ. 5 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైనట్టు పసిగట్టింది. దీనిపై కేసు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో ఏపీ ఫిషరీస్, ఇంజనీరింగ్ విభాగంలోని ఎగ్జిక్యూటివ్ సత్యనారాయణను తొలి ముద్దాయిగా సీబీఐ పేర్కొంది. కేసులో భాగంగా ఇప్పటివరకూ కేసీఆర్ ప్రైవేటు కార్యదర్శిని విచారించిన తరువాత ఆయన్ను కూడా ప్రశ్నించాలని భావించిన సీబీఐ కేసీఆర్ ఇంటికి వచ్చినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News