: తిరుమల లడ్డూపోటు నిర్వాహకుడు రమేష్ అయ్యంగార్ మృతి
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయ లడ్డూ పోటు నిర్వాహకుడు రమేష్ అయ్యంగార్ మృతి చెందారు. ఈ ఉదయం 9 గంటలకు ఆయనకు గుండెపోటు రావడంతో, తిరుపతిలోని అపోలో ఆసుపత్రికి ఆయనను తరలించారు. ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. కొన్ని తరాలుగా శ్రీవారి ఆలయంలో లడ్డుపోటు బాధ్యతలను వీరి కుటుంబీకులే నిర్వహిస్తున్నారు. రమేష్ అయ్యంగార్ వయసు 48 సంవత్సరాలు. రమేష్ మృతితో తిరుమలలో విషాదం అలముకుంది.