: పవన్ ను స్వయంగా ఆహ్వానించని బాబుపై జనసేన నిరసన
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించేందుకు స్వయంగా వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తమ అభిమాన హీరో పవన్ కల్యాణ్ దగ్గరకు వెళ్లకపోవడంపై ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం పవన్ చుట్టూ తిరిగి చంద్రబాబు, ఇప్పుడు కావాలనే దూరం పెడుతున్నారని ఆరోపించారు. ఓట్ల కోసం వాడుకుని ఇప్పుడు మరచిపోయారా? అని ప్రశ్నించారు. ఈ మేరకు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జనసేన కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి ఆందోళన చేశారు. "పవన్ కల్యాణ్ ను విస్మరించిన చంద్రబాబు" అంటూ బ్యానర్లను ప్రదర్శించారు. వీరి నిరసనలతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది.