: చెన్నై లోకల్ ట్రైన్ లో అగ్నిప్రమాదం
చెన్నైలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళుతున్న ఓ లోకల్ ట్రైన్ లో మంటలు చెలరేగాయి. వేలచెర్రి నుంచి చెన్నై బీచ్ కు వెళుతుండగా పెరుంగుడి వద్ద ఈ ప్రమాదం సంభవించింది. అయితే, ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటంతో, ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు. ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం ఎలా సంభవించిందన్న దానిపై రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.