: అమరావతిలో వీఐపీలు, వీవీఐపీల భోజనం ఇలా..!
అమరావతి శంకుస్థాపనకు వచ్చే సాధారణ ప్రజలు, భూములిచ్చిన రైతులకు రూ. 60 విలువైన భోజన ప్యాకెట్లను అందజేస్తున్న ఏపీ ప్రభుత్వం లాంజ్ లో ఆసీనులయ్యే 6 వేల మందికి, ఆపై ప్రత్యేక అతిథులుగా వచ్చే 750 మందికి ప్రత్యేక మెనూతో కూడిన వంటకాలను సిద్ధం చేసింది. ఇందులో దేశ విదేశీ వంటకాలున్నాయి. ఎఎఎ పాస్ లతో వచ్చే 6 వేల మందికి నిమ్మరసం, గ్రీన్ సలాడ్, స్ప్రౌట్స్, ఉలవచారు, సాంబారు, మిరియాల రసం, మెంతి మజ్జిగ, వంకాయ పచ్చిపులుసు, కొత్త ఆవకాయ, చౌచౌ పచ్చి, పచ్చి జామకాయ చట్నీ, కొబ్బరి- చింతకాయ చట్నీ, ఉల్లి గోంగూర, నిమ్మకాయ పచ్చడి, కరివేపాకు కారం, కొబ్బరి శెనగ కారం, అప్పడాలు, మినప వడియాలు, ఊర మిరపకాయలు, కుండ పెరుగు, అన్నం, పులిహోర వడ్డిస్తారు. ఇక వీవీఐపీల హోదాలో వచ్చే 750 మందికి బూరెలు, డ్రై ఫ్రూట్స్, కార్న్ సమోసా, పండ్లరసం, జున్ను, తేనె, బెల్లంతో చేసిన జిలేబీ, ఐదు రకాల ఫ్రూట్ సలాడ్, మూడు రకాల పాన్ లు, మూడు రకాల ఐస్ క్రీమ్స్ అదనంగా ఉంటాయి. వీరందరికీ కిన్లే వాటర్ బాటిల్స్ అందుబాటులో ఉంటాయి. విదేశాల నుంచి వచ్చే 100 మంది కోసం జపనీస్, ఇటాలియన్ మెనూ సిద్ధమవుతోంది.