: అమరులారా... మీకు జోహార్లు!... నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం!


విధి నిర్వహణలో భాగంగా తమ ప్రాణాలను సైతం లెక్కచేయని పోలీసు అమర వీరులను స్మరించుకుంటూ, తెలుగు రాష్ట్రాల్లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ఘనంగా సాగింది. హైదరాబాద్ గోషామహల్ లో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు గవర్నర్ నరసింహన్, డీజీపీ అనురాగ్ శర్మ పాల్గొన్నారు. పేదలకు కట్టిస్తామన్న డబుల్ బెడ్ రూం ఇళ్లలో 10 శాతం పోలీసులకు కేటాయిస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. పోలీసుల త్యాగాలను మరువలేమని, ధైర్య సాహసాలు చూపిన వారికి మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తామని వివరించారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు ఎన్నో త్యాగాలు చేస్తున్నారని కొనియాడారు. ట్రాఫిక్ పోలీసులకు ప్రస్తుతం ఇస్తున్న పొల్యూషన్ అలవెన్స్ ను 30 శాతం పెంచుతున్నట్టు కేసీఆర్ తెలిపారు. మరోవైపు ఏపీలో జరిగిన వేడుకల్లో సీఎం చంద్రబాబు, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప డీజీపీ జాస్తి వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ, దేశం కోసం అమరులయ్యేందుకు పోలీసులు మాత్రమే కాకుండా, ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పోలీసు అమర వీరుల నిధికి రూ. 20 కోట్లు తక్షణం కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.

  • Loading...

More Telugu News