: 12 ఏళ్లుగా హైదరాబద్ లో ఉంటున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జాఫర్ అరెస్ట్
2003లో అహ్మదాబాద్ లో జరిగిన పేలుళ్ల ప్రధాన నిందితుడు, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది గులాం జాఫర్ షేక్ ను గుజరాత్ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. గోద్రాలో జరిగిన అల్లర్ల తరువాత కుటుంబంతో సహా హైదరాబాద్ కు వచ్చి బేగంపేటలో నివసిస్తున్న ఆయనను గుజరాత్ నుంచి వచ్చిన ప్రత్యేక ఏటీఎస్ పోలీసుల బృందం అదుపులోకి తీసుకుంది. జాఫర్ కు ఐఎస్ఐ, జైషే మహమ్మద్, లష్కరే తోయిబాతో దగ్గరి సంబంధాలు ఉన్నాయని, ఆయన్ను నేర పరిశోధన విభాగానికి అప్పగించామని పోలీసులు తెలిపారు. గోద్రా అల్లర్ల తరువాత ప్రతీకార దాడుల కోసం జాఫర్ ఐఎస్ఐలో చేరి ఉగ్రవాదిగా మారాడని వివరించారు. జాఫర్ స్వస్థలం గుజరాత్ లోని దరియాపూర్ అని, 12 సంవత్సరాలుగా హైదరాబాద్ లో అజ్ఞాత జీవితం గడుపుతున్నాడని వెల్లడించారు.